DS resigns from Congress party: కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిన డి.శ్రీనివాస్ ఒక్కరోజలోనే ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్‌లో చేరాడన్న డీఎస్.. అతనితో కలిసి గాంధీభవన్‌కి వెళ్లినట్లు వివరించారు. అయితే తనకు పార్టీ కండువ కప్పిన నేతలు.. కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనని వివాదాల్లోకి లాగవద్దని కోరారు. వయసు రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు డీఎస్ తెలిపారు.
కాంగ్రెస్‌లో చేరానని భావిస్తే రాజీనామా చేస్తున్నా అంటూ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి డీఎస్ లేఖ రాశారు. ఆ లేఖలో తన భార్య విజయలక్ష్మిని సాక్షిగా పేర్కొన్నారు. రాజకీయాల కోసం డీఎస్‌ని వాడుకోవద్దని విజయలక్ష్మి సూచించారు. అయనకు ఇప్పటికే ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్న ఆమె.. ప్రశాంతంగా ఉండనివ్వాలంటూ విజ్ఞప్తిచేశారు.
Sanjay comments on DS resignation: ఐతే ఈ వ్యవహారం డీఎస్ కుటుంబంలో వివాదాన్ని రాజేసింది. డీఎస్ పెద్దకొడుకు సంజయ్.. ధర్మపురి అర్వింద్‌పై ఆరోపణలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖ డీఎస్ రాసే అవకాశం లేదని దీని వెనుక అర్వింద్ హస్తం ఉందని ఆరోపించారు.
Arvind comments on DS resignation: తన తండ్రి డిఎస్ ఎపిసోడ్‌లో తనకు ఏలాంటి సంబంధం లేదని ఆయన కుమారుడు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వివరణ ఇచ్చారు. తన తండ్రి పక్కా కాంగ్రెస్ వాది అని.. తాను పక్కా బీజేపీ వాదిని అని స్పష్టం ఆయన చేశారు. 2018 నుంచి కాంగ్రెస్‌లో చేరతానని తన తండ్రి చెబుతున్నా ఎందుకు చేర్చుకోలేదని ఆయన ప్రశ్నించారు. తన తండ్రి డిఎస్ మాట్లాడలేని, మాట్లాడినా గుర్తుండని, నడవలేని పరిస్థితిలో ఉంటే పార్టీలో చేర్పించుకోవడం సరియైనది కాదన్నారు.
DS Health Bulletin: ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్యంపై సిటి న్యూరో సెంటర్ ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఒత్తిడి అధికమై రాత్రి తిరిగి ఫిట్స్ కూడా వచ్చినట్లు ఆయన భార్య విజయలక్ష్మి తెలిపారు. అనారోగ్యం బాధపడుతున్నతన భర్తడిఎస్‌తో రాజకీయాలు చేయడం సరికాదని ఆమె విజ్ఞప్తి చేశారు.
మరోవైపు డీఎస్‌కు రక్షణ కల్పించాలని కాంగ్రెస్ నేత నిరంజన్.. డీజీపీని కోరారు. డీఎస్‌కు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఆయన ఆరోపించారు. వేధింపుల గురించి డీఎస్ స్వయంగా ప్రస్తావించారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చేరాలని డీఎస్‌పై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపిన ఆయన.. ఏడాదిగా కాంగ్రెస్‌లో చేరాలని ఆయన భావిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి ధర్మపురి శ్రీనివాస్ రాజీనామా ఇవీ చదవండి: