నిజామాబాద్ జిల్లా పరిషత్ కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. జడ్పీ ఛైర్మన్‌గా దాదన్నగారి విఠల్ రావు, వైస్ ఛైర్మన్‌గా రజిత యాదవ్లు ప్రమాణం చేశారు. వీరితో కలెక్టర్ రామ్మోహన్ రావు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. తెరాస సభ్యులు జై తెలంగాణ, భాజపా సభ్యులు భారత్ మాతాకీ జై అంటూ పోటాపోటీ నినాదాలు చేయడం వల్ల సభలో గందరగోళం నెలకొంది.
నిజామాబాద్ పరిషత్ పాలకవర్గం ప్రమాణం - prashanth reddy
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్ కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. నిజామాబాద్ జిల్లా పరిషత్ జడ్పీ ఛైర్మన్‌గా విఠల్ రావు, వైస్ ఛైర్మన్‌గా రజిత ప్రమాణస్వీకారం చేశారు.
![నిజామాబాద్ పరిషత్ పాలకవర్గం ప్రమాణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3757816-thumbnail-3x2-nzb.jpg)
మంత్రితో జడ్పీ ఛైర్మన్