ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పట్టణాలు, పల్లెలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ పేర్కొన్నారు. పట్టణంలోని సీతారాంనగర్ కాలనీలో రూ.10 లక్షలతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్‌తో కలిసి ప్రారంభించారు.
సీతారాంనగర్ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్ - మేయర్ నీతూ కిరణ్ తాజా వార్తలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 8వ డివిజన్ సీతారాంనగర్ కాలనీలో పట్టణ ప్రగతి నిధులు రూ.10 లక్షలతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ విక్రమ్‌గౌడ్‌తో కలిసి మేయర్ నీతూ కిరణ్ ప్రారంభించారు.

సీతారాంనగర్ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్
గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న కాలనీవాసుల సమస్య నేటితో తీరిపోతుందని మేయర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పట్టణాలు, పల్లెలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గణేశ్ గుప్తా సహాయ సహకారంతో నగరంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజినీర్ ఇనాయత్ కరీం, శ్రీకాంత్, ఇతర సిబ్బంది, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో మరోసారి సీరం సర్వే