గోదావరికి వరద ప్రవాహం పెరిగింది. ఎగువన ఉన్న మహారాష్ట్రలోని ప్రాజెక్టులు నిండిపోవటం వల్ల దిగువకు నీటి విడుదలతో నదిలో నీటిమట్టం పెరిగింది. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువ నుంచి వస్తోన్న వరదకు గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోని త్రివేణి సంగమం కందకుర్తి వద్ద నీటి మట్టం తారస్థాయికి పెరిగింది. ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాంతం నుంచి దాదాపు లక్ష క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడం వల్ల గోదావరిలో జలకళ ఏర్పడింది.
బాబ్లీ గేట్లు ఎత్తివేత... గోదావరి పరవళ్లు
గోదావరికి వరద ఉద్ధృతి పెరిగింది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్యులు నీటిని దిగువకు వదలడం వల్ల నదిలో వరద ప్రవాహం పెరిగింది. దిగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు రాత్రి వరకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
బాబ్లీ గేట్లు ఎత్తివేత... గోదావరి పరవళ్లు