ప్రజా సమస్యల పరిష్కారం కోసం.. తెలంగాణ డిమాండ్స్ డేను జయప్రదం చేయాలని వామపక్షాలు ప్రజలకు సూచించాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. ప్రజాసమస్యల పరిష్కారం కొరకు డిమాండ్స్ డేగా పాటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమన్న పేర్కొన్నారు. నిజామాబాద్ లోని సీపీఎం పార్టీ కార్యాలయంలో జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు గడిచినా.. ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమన్న ఎద్దేవా చేశారు. ప్రధానంగా పేదలకు ఉపాధి, ఉద్యోగం, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, మూడెకరాల భూమి అంద లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. వీటి పరిష్కారం కొరకు అనేక పోరాటాలు చేసినా పట్టించుకోవట్లేదని విమర్శించారు. పేదలందరికి రేషన్ బియ్యంతో పాటు, రూ.1500లు నగదును, నిత్యావసర సరకులను అందజేయాలని భూమన్న డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు.
ఇదీ చూడండి:రంగనాయక, మల్లన్న సాగర్ల భూసేకరణపై హరీశ్ సమీక్ష