తెలంగాణ

telangana

ETV Bharat / state

అధిక ధరలకు విక్రయిస్తున్న కిరాణా షాపు సీజ్​ - నిజామాబాద్​ వార్తలు

నిజామాబాద్​లో అధిక ధరలకు నిత్యావసర వస్తువులు విక్రయిస్తున్న ఓ కిరణా దుకాణాన్ని పౌర సరఫరాల అధికారులు సీజ్​ చేశారు. హెల్ప్​లైన్​ నంబర్​కు వినియోగదారులు ఫిర్యాదు చేయడం వల్ల రంగంలోకి దిగిన అధికారులు షాపును మూసివేశారు.

అధిక ధరలకు విక్రయిస్తున్న కిరాణా షాపు సీజ్​
అధిక ధరలకు విక్రయిస్తున్న కిరాణా షాపు సీజ్​

By

Published : Mar 27, 2020, 11:46 AM IST

అధిక ధరలకు సరుకులు విక్రయిస్తున్న ఓ కిరాణా దుకాణాన్ని పౌర సరఫరాల అధికారులు సీజ్ చేశారు. నిజామాబాద్​ మాలపల్లిలోని కిరాణా షాపులో ధరలు పెంచి సరుకులు విక్రయిస్తున్నారని హెల్ప్ లైన్ నంబర్​కు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు, పౌర సరఫరాల అధికారులు కలిసి తనిఖీ నిర్వహించారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారని తేలినందున అధికారులు ఆ దుకాణాన్ని సీజ్ చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ కొనసాగుతున్నందున దుకాణదారులు ఎవ్వరూ అధిక ధరలకు సరుకులు విక్రయించొద్దని ఒకటో పట్టణ సీఐ ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు బేఖాతరు చేస్తే దుకాణం సీజ్ చేయడంతోపాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అధిక ధరలకు విక్రయిస్తున్న కిరాణా షాపు సీజ్​

ఇదీ చూడండి:నిబంధన అతిక్రమిస్తే చలానా ఇంటికొస్తుంది: డీజీపీ

ABOUT THE AUTHOR

...view details