తెలంగాణ

telangana

ETV Bharat / state

'ముస్లిం సోదరులు రంజాన్​ను ఇంట్లోనే చేసుకోండి' - LOCK DOWN EFFECTS

నిజామాబాద్​ జిల్లా బోధన్​లో డీసీపీ రఘువీర్​ పర్యటించారు. లాక్​డౌన్​ అమలు, పోలీసులు చేపట్టిన చర్యలను డీసీపీ పరిశీలించారు. కరోనా కట్టడి కోసం పోలీసులకు ప్రజలు సహాకరించాలని సూచించారు.

The festival should be celebrated at home DCP said
'ముస్లిం సోదరులు రంజాన్​ను ఇంట్లోనే చేసుకోండి'

By

Published : Apr 22, 2020, 6:14 PM IST

ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఇంట్లోనే చేసుకోవాలని అడిషనల్ డీసీపీ రఘువీర్ సూచించారు. నిజామాబాద్ జిల్లా బోధన్​లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు, లాక్​డౌన్ అమలు తీరును పరిశీలించారు. పోలీసులకు ప్రజలు సహకరించి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాసినా, ఎవరినైనా దూషించినా... కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.

ఇదీ చూడండి:-లాక్​డౌన్​ నుంచి వీటికి మినహాయింపు

ABOUT THE AUTHOR

...view details