అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ అని నిజామాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నారాయణ అన్నారు. జగ్జీవన్ రామ్ జన్మదినం సందర్భంగా జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రాపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
'సమసమాజ స్థాపన కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది' - nijamabad district bjp
అంబేడ్కర్, జగ్జీవన్ రామ్లు కలలుకన్న సమసమాజ స్థాపన కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని నిజామాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనారాయణ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
!['సమసమాజ స్థాపన కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది' babu jagjeevan ram birthaday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11284306-330-11284306-1617608622130.jpg)
నిజామాబాద్ జిల్లాలో బాబు జగ్జీవన్ జన్మదిన వేడుకలు
అంబేడ్కర్, జగ్జీవన్ రామ్లు కలలుగన్న సమసమాజం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని బస్వా లక్ష్మీనారాయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు న్యాలం రాజు, పోతన్కారు లక్ష్మీ నారాయణ, మల్లేష్ యాదవ్, లింగం పంచారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:లాక్‌డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులు సృష్టించిన వ్యక్తి అరెస్టు