నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల తహసీల్దార్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు... ఓ మహిళా వీఆర్ఏ ఉపతహసీల్దార్కు ఫిర్యాదు చేసింది. గత కొన్ని రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తన ఫిర్యాదును జిల్లా పాలానాధికారితోపాటు ఇతర ఉన్నతాధికారులకు కూడా పంపించాలని ఆమె కోరారు. విధుల పేరుతో కార్యాలయానికి పిలింపించుకొని అసభ్యంగా ప్రవర్తించినందుకు అతనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
తహసీల్దార్ కార్యాలయంలో లైంగిక వేధింపులు - లైంగిక వేధింపులు
అతను ఓ తహసీల్దార్... బాధ్యతయుతమైన స్థానంలో ఉన్నాడు. కానీ అదే కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా వీఆర్ఏని లైంగిక వేధిస్తూ తన దుర్బుద్ధిని బయట పెట్టాడు. విసిగిపోయిన బాధిత మహిళ అతనిపై చర్యలు తీసుకోవాలని ఉప తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసింది.

వీఆర్ఏపై తహసీల్దార్ లైంగిక వేధింపులు