పసుపు బోర్డు, మద్దతు ధర కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో సమావేశమైన పసుపు రైతులు... ఈ అంశంపై కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు.
'గిట్టుబాటు ధర ప్రకటించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తాం' - మద్దతు ధర
పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధరను ఇవ్వకుంటే ధర్నాను ఉద్ధృతం చేస్తామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు హెచ్చరించారు.
'గిట్టుబాటు ధర ప్రకటించకుంటే మరింత ఉద్ధృతం చేస్తాం'
మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు భూములు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినా... వాటిని అమలు పరచడంలో భాజపా విఫలమవుతోందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ సమావేశంలో పసుపు బోర్డు, మద్దతు ధర గురించి ప్రస్తావించకపోవడాన్ని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఖండించారు.
ఇదీ చదవండి:చీమలు గీసిన రూపం.. 'చిండీ మాత' ఆలయం!