తెలంగాణ

telangana

ETV Bharat / state

అప్పుడు పని చేశాం.. ఇప్పుడు ఆదుకోండి.. - TEMPORARY DRIVERS AND CONDUCTORS PROTEST IN NIZAMABAD

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

rtc
అప్పుడు పని చేశాం.. ఇప్పుడు ఆదుకోండి..

By

Published : Dec 9, 2019, 1:15 PM IST

నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ సమ్మె సమయంలో 55 రోజుల పాటు ఆర్మూర్ డిపోలో విధులు నిర్వహించిన తాత్కాలిక ఉద్యోగులు తమను సీఎం కేసీఆర్ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయితే సమ్మె మొదలైన రోజు నుంచి తాము విధులు నిర్వహించామని... ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాల్లో చేరడం వల్ల తమను పట్టించుకునేవారు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్టీసీ కార్మికుల మాదిరిగానే తమపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దయ చూపించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వానికి అండగా ఉంటూ.. ప్రయాణికులను గమ్యస్థలాలకు చేర్చిన తమకు న్యాయం చేయాలంటూ కోరారు.

అప్పుడు పని చేశాం.. ఇప్పుడు ఆదుకోండి..

ఇవీ చూడండి: పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై వాడీవేడి చర్చ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details