లాక్డౌన్తో మహారాష్ట్రలో చిక్కుకున్న తమను స్వస్థలాలకు తీసుకెళ్లాలని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్పూర్ సరిహద్దు వద్ద మహారాష్ట్ర దెగలూరు ఐటీఐ కళాశాలలో 20 రోజులుగా 26 మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వీరు మహారాష్ట్రలోని ఉద్గిర్, లాతూర్లో వ్యవసాయ శిక్షణ పొందుతున్నారు.
మహారాష్ట్రలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు - సరిహద్దులో చిక్కుకున్న విద్యార్థులు
తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది విద్యార్థులు మహారాష్ట్ర సరిహద్దులో చిక్కుకున్నారు. ఇక్కడి నుంచి స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు రెండు రాష్ట్రాల అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మహారాష్ట్రలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు
మార్చి 26న వారు ఉండే ప్రాంతాల నుంచి వంద కిలోమీటర్లకు పైగా కాలిబాటన మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుకు 28న చేరుకున్నారు. మహారాష్ట్ర పోలీసులు అడ్డుకొని ఐటీఐ కళాశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఈనాడు-ఈటీవీ భారత్ ప్రతినిధి అక్కడికి వెళ్లి వారి ఇబ్బందులను మాట్లాడించారు. దయచేసి మమ్మల్ని స్వస్థలాలకు తీసుకెల్లాలని వేడుకున్నారు.
ఇదీ చూడండి:లాక్డౌన్ ఉన్నా జల్లికట్టు ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు