తరగతులు బహిష్కరించిన టీయూ విద్యార్థులు - telangana university students Expelled classes
కౌన్సిలింగ్ అనంతరం మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు తరగతులు బహిష్కరించారు.
తరగతులు బహిష్కరించిన టీయూ విద్యార్థులు
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశం కల్పించాలని కోరుతూ తరగతులు బహిష్కరించి నిరసన తెలిపారు. కౌన్సిలింగ్ అనంతరం మిగిలిన సీట్లను వెంటనే స్పాట్ అడ్మిషన్స్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని విభాగాల్లో మిగిలిపోయిన సీట్లను వెంటనే భర్తీ చేయాలని, స్పాట్ అడ్మిషన్లు నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.
- ఇదీ చూడండి : అమానుషం... అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ దారుణ హత్య