నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం వసతి గృహంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బాలికల వసతి గృహానికి సెక్యూరిటీ గార్డులు లేరని, హాస్టళ్లలో నీటి సమస్య తలెత్తిందని, వంట చేసే వాళ్ళు లేక ఆహార పదార్థాలు బయట నుంచి తీసుకొస్తున్నారని... అది అందరికీ సరిపోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తరగతులు బహిష్కరించి విశ్వవిద్యాలయ పరిపాలన భవనం ముందు బైఠాయించారు.
వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల ఆందోళన - హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన
తెలంగాణ విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు నిరసనకు దిగారు. తరగతులను బహిష్కరించి రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.

వసతి గృహాల్లో సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థుల ఆందోళన
విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది జీవో నంబర్ 14 అమలు చేసి.. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా నిరవధిక సమ్మెకు దిగారు. ఈ కారణంతో వసతి గృహాల్లో ఇబ్బందులు తలెత్తాయి.
వసతి గృహాల్లో సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థుల ఆందోళన
ఇదీ చూడండి: వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధం..!