Telangana University latest news : వర్శిటీ పదవుల విషయంలో గత కొంత కాలంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో నడుస్తున్న వివాదం ఇవాళ్టీతో చల్లారినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ సూచనల మేరకు వీసీ రవీందర్ గుప్తా.. యూనివర్శిటీ రిజిస్ట్రార్‌గా ఆచార్య యాదాగిరిని నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో ఆరు నెలలు టీయూ రిజిస్ట్రార్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు. అనంతరం నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు వీసీ పయనమయ్యారు. దీంతో మరోసారి విశ్వవిద్యాలయంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.
Outsourcing employees strike at TU : తెలంగాణ వర్శిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసనలు 5వ రోజుకు చేరాయి. జీతాల కోసం పరిపాలన భవనం ఎదుట పోరుగు సేవల ఉద్యోగులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. నిరసన ప్రభావంతో వసతి గృహలలో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.. వీసీ, ఈసీ సమన్వయంతో వ్యవహరించి తమకు జీతాలు వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వర్శిటీలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. జీతాలు వచ్చే వరకు నిరసనలు విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆకాలి బాధ చూడలేక ఇవాళ్టీ నుంచి వంట చేసిన అనంతరం సిబ్బంది నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని సిబ్బంది ప్రకటించారు.
- TU Controversy Latest Issue : ఆగని రిజిస్ట్రార్ 'కుర్చీ కొట్లాట'.. విద్యార్థి సంఘాల ఆందోళన
- TU VC vs EC Controversy : రిజిస్ట్రార్‌గా కొనసాగే అర్హత అతనికి లేదు: వీసీ రవీందర్
Telangana University VC and Registrar controversy : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని ఉన్న తెలంగాణ యూనివర్శిటీకి వివాదాలు కొత్తకాదు. కొన్ని నెలలుగా రిజిస్ట్రార్ కుర్చీ చుట్టూ జరుగుతున్న రాజకీయంతో వర్సిటీ పరువు మరింత దిగజారుతోంది. వీసీగా రవీందర్ గుప్తా బాధ్యతలు తీసుకుని రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే.. ఇప్పటికే తొమ్మిది సార్లు రిజిస్ట్రార్‌లు మారారంటే వర్శిటీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.