తెలంగాణ

telangana

By

Published : May 26, 2023, 8:03 PM IST

ETV Bharat / state

Telangana University Controversy : తెలంగాణ యూనివర్సిటీలో మళ్లీ మొదలైన రిజిస్ట్రార్​ కుర్చీ పోరు

Registrar Controversy In Telangana University : తెలంగాణ విశ్వవిద్యాలయం అంటేనే కాంట్రవర్సీకి కేరాఫ్​ అడ్రస్​గా మారిపోయింది. యూనివర్సిటీలో ఏళ్ల తరబడి అనేక సమస్యలు ఉన్నా.. ఆ సమస్యలను గాలికొదిలేసి బహిరంగంగానే కుమ్ములాటలకు దిగుతున్నారు. తెలంగాణ యూనివర్సిటీలోని రిజిస్ట్రార్​ కుర్చీ కోసం కుమ్ములాట మళ్లీ మొదలైంది.

telangana university
telangana university

Controversy In Telangana University on Registrar : నిజామాబాద్​లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్​ కూర్చీ కొట్లాట మళ్లీ మొదటికే వచ్చింది. వీసీ మొదట ఓయూ ప్రొఫెసర్​ నిర్మలాదేవిని రిజిస్ట్రార్​గా నియమించగా.. పాలక మండలి మాత్రం ఆచార్య యాదగిరినే రిజిస్ట్రార్​గా కొనసాగించాలని సూచించారు. ఆ తర్వాత వీసీ రవీందర్​ గుప్తా కూడా యాదగిరిని ఆ స్థానంలో ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడే వచ్చింది పెద్ద చిక్కు.. మళ్లీ​ టీయూ ఇన్​ఛార్జి రిజిస్ట్రార్​గా కనకయ్యను ఉప కులపతి నియమించారు. ఆయన ఆ కుర్చీలో ఉండడాన్ని విద్యార్థి సంఘ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.

ఎలాంటి వివాదాలు లేకుండా పాలన సాగిస్తా :తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య కనకయ్య యూనివర్సిటీ అభివృద్ధి కొరకు అందరినీ కలుపుకొని పనిచేస్తానని.. ఎలాంటి వివాదాలు లేకుండా వర్సిటీ పరిపాలనకు ప్రయత్నిస్తానని కనకయ్య వెల్లడించారు. ఈసీ సభ్యుల సహకారం తనకు ఉందని తనకు సీనియార్టీ ప్రకారం రిజిస్ట్రార్ పదవికి అర్హుడు అని తెలిపారు. యూనివర్సిటీ ఉద్యోగులు సిబ్బంది వర్సిటీలో నెలకొన్న వివాదాలను పరిష్కారం చేసే ప్రయత్నం చేయాలని తనకు కోరినట్లు తెలిపారు.

TU VC vs EC Controversy : రిజిస్ట్రార్​గా కొనసాగే అర్హత అతనికి లేదు: వీసీ రవీందర్

Telangana University VC Ravinder Gupta:అంతకు ముందు రిజిస్ట్రార్​గా ఉన్న నిర్మలాదేవి ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆమె నిర్ణయంతో మళ్లీ యాదగిరి రిజిస్ట్రార్​గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలకు సంబంధించిన బ్యాంకు సంతకానికి.. యాదగిరిని బ్యాంకు అధికారులు అనుమతించలేదు. అయితే ఇప్పటివరకు పాలమండలికి, వీసీకి మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకుంటే.. ఇప్పుడు ఇన్​ఛార్జి రిజిస్ట్రార్​గా కనకయ్యను నియమించడం వివాదాలకు తెరలేపింది.

ఇప్పటివరకు ఐదుగురు రిజిస్ట్రార్​లు మార్పు : గతేడాది సెప్టెంబర్​లో కనకయ్యను వీసీ రవీందర్​ గుప్తా ఇన్​ఛార్జి రిజిస్ట్రార్​గా నియమించారు. అతనిని పాలకమండలి ఒప్పుకోకపోవడంతో నెల రోజుల్లోనే అతను ఆ పదవి నుంచి దిగిపోయారు. ఆ తర్వాత కళాశాల విద్య కమిషనర్​ నవీన్​ మిత్తల్​ నియమించిన యాదగిరి ఆ బాధ్యతలను తీసుకున్నారు. 40 రోజుల్లోనే అక్కడ జరుగుతున్న పరిణామాలను చూసి ఆయనే పదవి నుంచి దిగిపోయారు. దీంతో మూడో వ్యక్తిని శివశంకర్​ను ఇన్​ఛార్జి రిజిస్ట్రార్​గా వీసీ రవీందర్​ గుప్తా నియమించారు.

మూడు నెలల్లో పాలకమండలి ఆమోదం పొందక.. ఆయన కూడా నిష్కమించారు. మరో దారిలేక అకాడమిక్​ ఆడిట్​ సెల్​ డైరెక్టర్​ విద్యావర్థినిని ఉపకులపతి ఇన్​ఛార్జి రిజిస్ట్రార్​గా నియమించారు. ఆమె నియామకాన్ని ఈసీ వ్యతిరేకించింది. అప్పుడు మళ్లీ ముచ్చటగా ఐదోసారి ఓయూ ప్రొఫెసర్​ నిర్మలాదేవిని రిజిస్ట్రార్​గా నియమించారు. ఇప్పుడు మళ్లీ కుర్చీల గురించి కొట్లాట మొదలైంది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details