Telangana University Issues : 2006లో ఏర్పాటైనతెలంగాణ విశ్వవిద్యాలయం..మొదట ఆరు కోర్సులతో గిరిరాజ్ కళాశాలలో ప్రారంభించి.. 2009లో డిచ్‌పల్లి మండలంలోని నడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి పక్కన క్యాంపస్‌గా మార్చారు. నేటికీ కోర్సులకు అవసరమైన భవనాలు, వసతి గృహాలు పూర్తి కాలేదు. ఉన్న భవనాలలోనే తరగతులు, వసతి గృహాలను నిర్వహిస్తున్నారు. అధ్యాపకులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిపోతుండటం వల్ల విద్యార్థులు ఎంచుకున్న కోర్సుల్లో ఉత్తీర్ణత సాధిస్తున్నా.. పోటీ పరీక్షల్లో రాణించలేకపోతున్నారు. పరిశోధనలకు విశ్వవిద్యాలయం పరిధిలో అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికీ యూజీసీ నుంచి ఎక్కువగా నిధులు రావడంలేదు. వర్సిటీలో ప్రాంగాణ ఎంపికలు లేక పీజీ, డిగ్రీల పట్టాలతో బయటకు వెళ్తున్న విద్యార్థులు, వర్సటీలో ప్లేస్మెంట్ లేక ఉపాధి కోసం వెతుకులాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
TU Students Problems : వర్సిటీలో ఇప్పటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో అన్ని డిపార్టుమెంట్లలో భారీగా ఖాళీలు ఉన్నాయి. వీటిని రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయకపోవడం వల్ల అకాడమిక్ కన్సల్టెంట్లను తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ ప్రొఫెసర్లు సగం మంది స్థానికంగా ఉన్నా.. మిగతావారందరూ హైదరాబాద్ నుంచి వచ్చిపోవడంతో పాలన గాడి తప్పుతోంది.
''మా యునివర్సిటీలో సరిపడ సిబ్బంది లేరు, లాబ్స్ లేవు, జర్నలిజం విద్యార్థులకు స్టుడియో లేదు ఇలా ఏ వసతి లేకపోవడం వల్ల ప్రాక్టికల్‌గా నేర్చుకోలేపోతున్నాం. అబ్బాయిలకు రెండు హాస్టల్స్ ఉంటే అమ్మాయిలకు ఒకే వసతి గృహం ఉంది ఒక్కో గదిలో 10 నుంచి 12మంది ఉంటున్నారు. అడవి ప్రాంతం కాబట్టి పాములు, అడవి పందులు తిగుతున్నాయి ఎవరికైనా ఏమైనా అయితే వారిని తీసుకెళ్లడానికి సరిగ్గ అంబులెన్స్ లేదు ఇప్పుడైనా ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నాం." - విద్యార్థులు