Telangana University Incharge VC Vakati Aruna :తెలంగాణ వర్సిటీకి వైస్ ఛాన్సలర్ లేక 26 రోజులు గడుస్తుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయానికి ఇంఛార్జీ వీసీగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైవు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు.
TU VC Ravinder Gupta Released : తెలంగాణ వర్సిటీ ఉపకులపతి డీ. రవీందర్ గుప్తా గత నెల 17వ తేదీన అవినీతి నిరోధక శాఖ వలలో పడిన విషయం తెలిసిందే. తార్నాకలోని తన నివాసంలో రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం దాసరి శంకర్ అనే వ్యక్తి దగ్గరి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేయాల్సిన విశ్వవిద్యాలయం గత కొంతకాలంగా.. గొడవలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. దాదాపు నెల రోజులుగా వీసీ లేకుండా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యార్థుల గురించి ఆలోచించాల్సిన వీసీ వారి పేరిట లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది బయటకు వచ్చిన విషయం.. ఇక వర్సిటీలో ఉపకులపతి రవీందర్ గుప్తా చేసిన అరాచకాలు వెలుగులోకి రానివి ఇంకెన్నున్నాయో.