'కరెంట్ బిల్లులను పూర్తిగా రద్దు చేయాలి' - తెలంగాణలో కరెంట్ బిల్లులు
కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచి ప్రజల నడ్డి విరిచిందని తెతెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు కరెంట్ షాక్ కానుకగా ఇచ్చారని ఎద్దేవా చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కరెంట్ బిల్లులను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కరెంట్ బిల్లులను పూర్తిగా రద్దు చేయాలి
60 రోజులు పనులు లేక ప్రజలు కష్టాల్లో ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కానుకగా కరెంటు చార్జీలు పెంచారని తెదేపా నేతలు ఎద్దేవా చేశారు. పెంచిన కరెంట్ బిల్లులను ఎవ్వరూ చెల్లించవద్దని ప్రజలకు సూచించారు. కరెంటు బిల్లులను రద్దు చేయకపోతే తెదేపా ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పాల్గొన్నారు.