దేశంలో బాండ్ పేపర్‌తో ప్రచారం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. పసుపు బోర్డుపై నకిలీ జీవో ప్రకటించారని ఆరోపించారు.
'మాకు కావాల్సింది మసాలా బోర్డు కాదు.. పసుపు బోర్డు' - telangana state kisan congress president anvesh reddy
నిజామాబాద్‌కు స్పైసెస్ బోర్డు ప్రకటించడంపై రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేశ్ రెడ్డి మండిపడ్డారు. తమకు కావాల్సింది మసాలా బోర్డు కాదని, పసుపు బోర్డు కావాలని స్పష్టం చేశారు.
'మాకు కావాల్సింది మసాలా బోర్డు కాదు.. పసుపు బోర్డు'
సహకార ఎన్నికల్లో రైతు బంధు, రుణమాఫీ అంశాలను తెరాస తెరపైకి తీసుకువస్తోందని అన్వేశ్ మండిపడ్డారు. రబీ సాగు డిసెంబర్లో ప్రారంభమైతే... ఇప్పుడు రైతు బంధు డబ్బును ఖాతాల్లో జమచేయడమేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినా... గుర్తుకు రాని రుణమాఫీ సహకార ఎన్నికల్లో గుర్తుకొచ్చిందా అని అన్వేశ్ రెడ్డి కేసీఆర్ సర్కార్‌ను ప్రశ్నించారు.