రైతులను బలోపేతం చేసేలా.. పనిచేసే అవకాశం సహకార సంఘాలకు మాత్రమే ఉందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన డీసీసీబీ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'సహకార సంఘాలతోనే రైతుల బలోపేతం' - pocharam srinivasa reddy latest meeting
నిజామాబాద్ నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో డీసీసీబీ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. సహకార సంఘాల్లో నిజామాబాద్ అగ్రస్థానంలో ఉందని.. రాష్ట్రానికి ఆదర్శంగా జిల్లా సంఘాలు నిలుస్తున్నాయని సభాపతి కొనియాడారు.
'రైతులను బలోపేతం చేసే అవకాశం సహకార సంఘాలకే ఉంది'
సహకార సంఘాల్లో నిజామాబాద్ అగ్రస్థానంలో ఉందని.. రాష్ట్రానికి ఆదర్శంగా జిల్లా సంఘాలు నిలుస్తున్నాయని సభాపతి ప్రశంసించారు. రైతులకు మేలు చేసేలా సహకార సంఘాలు పని చేస్తూ మరింత ముందుకు సాగాలని సూచించారు. సహకార సంఘాలు లాభాపేక్ష లేకుండా పనిచేస్తూ.. రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయని టెస్కాబ్ ఛైర్మన్ రవిందర్రావు అన్నారు.
ఇదీ చూడండి: భూమి అధీనంలో ఉన్నవారికే హక్కులు...
TAGGED:
pocharam updates on dccb