తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి' - nizamabad district latest news

ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టి పదోన్నతుల కాలపట్టిక ప్రకటించాలని టీపీయూఎస్ నాయకులు డిమాండ్​ చేశారు. సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్​లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు.

Telangana Region Teachers Association protest in nizamabad district
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి

By

Published : Jan 11, 2021, 4:49 PM IST

ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టి పదోన్నతుల కాలపట్టిక ప్రకటించాలని... తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్​ చేశారు. సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్​లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు.

3 నెలల్లో పీఆర్‌సీ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 30 నెలల కింద హామీ ఇచ్చారని తెలిపారు. అది ఇంతవరకు అమలు కాలేదని వాపోయారు. ఆరేళ్లుగా పదోన్నతులు లేకపోవడం వల్ల తాము నష్టపోతున్నామంటూ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేశారు.

ఇదీ చదవండి: మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

ABOUT THE AUTHOR

...view details