తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Projects Water Levels Today : నిండుకుండల్లా ప్రాజెక్టులు.. గేట్లెత్తిన అధికారులు.. వారికి హెచ్చరికలు

Telangana Projects Water Levels Today : రికాం లేకుండా కురుస్తోన్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలెవరూ అనవసరంగా బయటకు వెళ్లొద్దని సూచించారు.

Telangana Projects
Telangana Projects Full Due To Heavy Rains

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2023, 1:37 PM IST

Telangana Projects Water Levels Today నిండుకుండల్లా ప్రాజెక్టులు గేట్లెత్తిన అధికారులు వారికి హెచ్చరికలు

Telangana Projects Water Levels Today :రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తోన్న వానలకు.. ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. దాదాపు అన్ని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ ప్రాజెక్టులు పూర్తిగా నిండటంతో అధికారులు చెరో 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. హిమాయత్‌సాగర్ ద్వారా 1,373 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయగా.. ఉస్మాన్‌సాగర్ రెండు గేట్ల ద్వారా 442 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదిలారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాశయాలకు వరద నీరు అధికంగా చేరుతుందని.. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు హెచ్చరించారు.

SRSP Water Level Today : నిజామాబాద్ జిల్లా​లోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 75,100 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 64,038 ఔట్‌ ఫ్లో ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మరింత వరద పెరిగే అవకాశమున్నందున.. సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. Water Levels in Telangana Projects Today : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు.. ప్రాజెక్టులకు పోటెత్తిన వరద నీరు

కడెం జలాశయంలోకీ వరద ఉద్ధృతి..: నిర్మల్‌ జిల్లాలోని కడెం జలాశయానికీ వరద నీరు చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 696.4 అడుగులుగా ఉంది. భారీ వర్షాలతో జలాశయంలోకి 14,455 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. ప్రాజెక్టు నుంచి 10,587 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. మరోవైపు కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్​ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ఇన్​ఫ్లో 29,800 క్యూసెక్కులుగా ఉంది. అధికారులు 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ ఉంది.

Kadem Project Generator Issue : కడెం జలాశయానికి వెంటాడుతున్నసాంకేతిక సమస్యలు.. మొరాయించిన జనరేటర్

వికారాబాద్ జిల్లాలోని పరిగిలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో.. లక్నాపూర్ ప్రాజెక్ట్ నిండుకుండలామారి పొంగిపొర్లుతోంది. కుండపోత వర్షానికి నస్కల్ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వికారాబాద్-పరిగిల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వికారాబాద్ నుంచి పరిగి వచ్చేవారు మన్నెగూడ నుంచి రావాలని పోలీసులు సూచిస్తున్నారు. దోమ మండలంలోని గొడుగోనిపల్లి, బాస్‌పల్లి, దోమవాగు, బ్రాహ్మణపల్లి, దిర్సంపల్లి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగుల వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు హెచ్చరిస్తున్నారు.

SRSP water levels today : ఎస్సారెస్పీకి నిలకడగా కొనసాగుతున్న వరద

Telangana Projects Water Levels : జలకళతో ఉట్టిపడుతున్న తెలంగాణ ప్రాజెక్టులు.. ఏది చూసినా నిండుకుండలాగే

ABOUT THE AUTHOR

...view details