తెలంగాణ

telangana

By

Published : Feb 11, 2021, 5:44 PM IST

ETV Bharat / state

'తలసేమియా బాధిత చిన్నారులకు అండగా తెలంగాణ జాగృతి'

తలసేమియా బాధిత చిన్నారులకు తెలంగాణ జాగృతి అండగా నిలుస్తుందని నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అవంతి రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. దాదాపు వంద మంది యువకులు రక్తదానం చేశారు.

Blood donation camp
తలసేమియా బాధిత చిన్నారులకు అండగా తెలంగాణ జాగృతి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో తెలంగాణ జాగృతి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. తలసేమియా బాధిత చిన్నారులకు అండగా తెలంగాణ జాగృతి నిలుస్తుందని ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు అవంతి రావు అన్నారు. కేర్ ఫిజియోథెరపీ క్లినిక్, కేర్ ఫుట్​బాల్ అకాడమీ సౌజన్యంతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో... దాదాపు వంద మంది యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని ఆయన అన్నారు.

ఇదివరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ... తలసేమియా బాధిత చిన్నారులకు నేరుగా రక్తదానం చేయడం చాలా సంతృప్తినిచ్చిందని అవంతి రావు అన్నారు. ఈ కార్యక్రమంలో తలసేమియా రక్తదాన శిబిరాల ఇన్‌ఛార్జ్ జలీల్, డాక్టర్ ఆకుల రవి, కోచ్ నాగరాజు, అపర్ణ, రామకృష్ణ, పురుషోత్తం, ప్రశాంత్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఉత్తరాఖండ్​లో మళ్లీ ఉప్పొంగిన నది

ABOUT THE AUTHOR

...view details