తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో ప్రశాంతంగా సాగుతున్న బంద్ - tsrtc employees strike 15th day latest

ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిజామాబాద్​ జిల్లావ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

నిజామాబాద్​లో ప్రశాంతంగా సాగుతున్న బంద్

By

Published : Oct 19, 2019, 3:23 PM IST

నిజామాబాద్​ జిల్లా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతుగా భాజపా ఆధ్వర్యంలో బంద్​ చేపట్టారు. బాల్కొండలో భాజపా కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని.. వేతనాలు పెంచాలని నినాదాలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్​తో ఆర్టీసీ బస్సులు తిరగలేదు. ప్రయాణికులు ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

నిజామాబాద్​లో ప్రశాంతంగా సాగుతున్న బంద్

ABOUT THE AUTHOR

...view details