తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు - nizamabad district latest news

స్వామి వివేకానంద 158వ జయంతి వేడుకలు ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి క్లబ్​ సభ్యులంతా పాల్గొని వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.

Swami Vivekananda Jayanti at the Officers Club in nizamabad
ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి

By

Published : Jan 12, 2021, 4:05 PM IST

స్వామి వివేకానంద 158 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్ జిల్లాలోని స్థానిక ఆఫీసర్స్ క్లబ్ లైబ్రరీలో వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతిని నిర్వహించారు.

స్వామి వివేకానంద భారతదేశ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని ప్రపంచ దేశాలకు చాటిన గొప్ప మహనీయుడని ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి పి. కిరణ్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. వివేకానంద దేశంకోసం జీవితాన్ని అర్పించిన మహనీయుడని.. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి ఎస్. శశిధర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి అంగిరేకుల సాయిలు, లైబ్రరీ కార్యదర్శి జగన్ మోహన్ గౌడ్, క్లబ్ సభ్యులు లక్ష్మారెడ్డి, డాక్టర్ మోతిలాల్, శ్రీనివాస్, సత్యనారాయణ తదితర సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే

ABOUT THE AUTHOR

...view details