తెలంగాణ

telangana

కలెక్టరేట్ వద్ద తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం

ఎన్ని చట్టాలు వచ్చినా, మార్పులు చేర్పులు జరిగినా రైతులు మాత్రం సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. నిజామాబాద్​లో తమ పొలాన్ని వేరే వ్యక్తులు పట్టా చేయించుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ తల్లీకొడుకు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించారు.

By

Published : Nov 9, 2020, 4:22 PM IST

Published : Nov 9, 2020, 4:22 PM IST

suicide-attempt-by-mother-son-at-nizamabad-collectorate
కలెక్టరేట్ వద్ద తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద తల్లీకొడుకు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. ఈ విషయం గమనించిన పోలీసులు వారిని అడ్డుకొని సర్దిచెప్పారు. భూవివాదంలో తమకు న్యాయం జరగకపోవడం వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు.

డిచ్​పల్లి మండలం యానాంపల్లి గ్రామంలో సర్వే నంబరు 43/17, 43లో గల 3ఎకరాల 20గుంటల భూమిని స్థానిక జడ్పీటీసీ కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అనుచరులు తమను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ నారాయణరెడ్డి స్పందించి వెంటనే విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇవీచూడండి:ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి తీవ్ర అస్వస్థత.. బాలిక మృతి

ABOUT THE AUTHOR

...view details