నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేటు ల్యాబ్ యజమానులు కరోనా టెస్టుల పేరుతో ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా ఆరు టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. కొన్ని కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేవని అధికారులు గుర్తించారు.
కరోనా పరీక్ష కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు - తెలంగాణ వార్తలు
నిజామాబాద్ జిల్లాలోని కరోనా పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. కరోనా పరీక్షల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ టీంలు రంగంలోకి దిగాయి. కొన్ని కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేవని అధికారులు గుర్తించారు.
కొవిడ్ కేంద్రాల్లో తనిఖీలు, కరోనా పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు
తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. అధిక ఫీజలు వసూలు చేయకూడదని సూచించారు. ప్రతి ల్యాబ్లో ధరల పట్టికను తప్పనిసరిగా పొందుపరచాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇదీ చదవండి:మరాఠా రిజర్వేషన్లపై నేడు సుప్రీం తీర్పు