రైతులు ఆరుగాలం పండిచిన పంట చేతికొచ్చేసరికి ప్రకృతి కన్నెర్ర చేసింది. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించి అన్నదాతను ఆగం చేశాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో కురిసిన అకాల వర్షానికి కల్లాలపై ఆరబెట్టిన ధాన్యం, మొక్కజొన్న, సోయాబీన్ ఎక్కడికక్కడ తడిసిముద్దయ్యాయి.
అకాల వర్షం.. రైతులకు తీరని నష్టం - నిజామాబాద్ ఆర్మూర్లో భారీ వర్షం
ఆరుగాలం పండించిన పంట చేతికందే సమయానికి అకాల వర్షాలు వచ్చి రైతన్నలకు కన్నీరు మిగిల్చాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం కారణంగా వరికల్లాలో ఆరబోసిన ధాన్యం తడిసిముద్ధయ్యింది.
![అకాల వర్షం.. రైతులకు తీరని నష్టం Submerged crop fields due to heavy rains at Nizamabad Armor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9096135-22-9096135-1602145295717.jpg)
అకాల వర్షం.. రైతులకు తీరని నష్టం
ఇప్పుడిప్పుడే జోరందుకున్న వరికోతలు వర్షం కారణంగా నీటపాలయ్యాయి. పంట నీటమునిగి తీవ్రంగా నష్టపోయామని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరారు.
ఇదీ చూడండి:భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు... ప్రమాదకరంగా రహదారులు