నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థినుల వసతి గృహంలో సీట్ల సంఖ్య పెంచాలని కోరుతూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వసతి గృహంలో వంద మందికే సీట్లు ఉన్నాయని... వాటి సంఖ్యను మరింత పెంచాలని కోరారు. మరికొంత మంది విద్యార్థినులు ప్రవేశం పొందడానికి దరఖాస్తు చేసుకున్నా ప్రవేశం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే భవనం శిథిలం అయినందున మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు.
విద్యార్థుల సంక్షేమం ప్రభుత్వానికి పట్టదా? - Students demand for Increased seats in Government Ladies Hostels
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. వసతి గృహంలో సీట్ల సంఖ్య పెంచాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
![విద్యార్థుల సంక్షేమం ప్రభుత్వానికి పట్టదా?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3727611-41-3727611-1562081559121.jpg)
విద్యార్థుల సంక్షేమం ప్రభుత్వానికి పట్టదా?