తెలంగాణ

telangana

ETV Bharat / state

సార్​ ఈ అన్నం తినలేకపోతున్నాం... విద్యార్థులు వినూత్న నిరసన - Students are protesting

Students are protesting కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యార్థులకు మధ్యాహ్న ఆహార పథకంలో అక్కడక్కడ నాణ్యత కొరవడుతోంది. అధికారులు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్న కొన్ని చోట్ల ఇలా నాణ్యత లోపించడంతో చక్కగా చదువు కోవాల్సిన పిల్లలు ఇలా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నిరసన బాట పట్టాల్సి వచ్చింది.

Students are protesting
Students are protesting

By

Published : Aug 30, 2022, 9:08 PM IST

Students are protesting: విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో రాళ్లు, పురుగులు వస్తున్నాయని అన్నం తినలేకపోతున్నామని నిజామాబాద్ జిల్లా రెంజల్​ మండంలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిరసన బాట పట్టారు. భోజనం సరిగ్గా పెట్టడం లేదని, నీళ్లు చారు పోస్తున్నారని విద్యార్థులు వాపోయారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాఠశాల ముందు బైఠాయించి వారు నిరసన వ్యక్తం చేశారు. ఏజెన్సీ నిర్వాహకులను మార్చాలని వారు డిమాండ్ చేశారు.

మధ్యాహ్న భోజనంలో రోజూ పురుగులు వస్తున్నాయి. భోజనం సరిగ్గా పెట్టడం లేదు. నీళ్లు, చారు పోస్తున్నారు. ఏజెన్సీ నిర్వహకులను మార్చాలి, లేకుంటే మేము ఇలానే ఆందోళన కొనసాగిస్తాం.-విద్యార్థి

సార్​ ఈ అన్నం తినలేకపోతున్నాం... విద్యార్థులు వినూత్న నిరసన

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details