కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అవసరం లేకపోయినా... పరీక్షల పేరిట లక్షల రూపాయలు వసూలు చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇద్దరు రోగులకు స్థానికంగా ఓ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు. మరో ఆసుపత్రిలో పరీక్షలు చేయిస్తే డెంగీ లేదని తేలింది. దీంతో రోగుల కుటుంబసభ్యులు ఆసుపత్రి ముందు నిర్వహించిన ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి.
ఆసుపత్రి ముందు విద్యార్థి సంఘాల ఆందోళన
అనవసర వైద్య పరీక్షలు చేస్తూ... ఆసుపత్రి యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నాయని కుమురం భీం ఆసిఫాబాద్లో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. బాధితులకు న్యాయ చేయాలని డిమాండ్ చేశారు.
ఆసుపత్రి ముందు విద్యార్థి సంఘాల ఆందోళన
బాధితులకు న్యాయం చేసే వరకు కదిలేది లేదని రోగుల కుటుంబసభ్యులు, విద్యార్థి నాయకులు భీష్మించుకూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేస్తామని ఆందోళన విరమింపజేశారు.
- ఇదీ చూడండి : అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణకు మరో అవకాశం