తెలంగాణ

telangana

ETV Bharat / state

'అనుమతి లేని నారాయణ స్కూలును రద్దు చేయాలి' - nizamabd latest news

నిజామాబాద్​లో అనుమతి లేకుండా నారాయణ స్కూల్​ యాజమాన్యం అడ్మిషన్లు చేయిస్తున్నాయంటూ విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. అనుమతి పొందని స్కూళ్లను రద్దు చేయాలంటూ డీఈవో కార్యలయం ఎదుట వారు ధర్నా నిర్వహించారు.

student leaders protest in front of deo office in nizamabad
'అనుమతి లేని నారాయణ స్కూలును రద్దు చేయాలి'

By

Published : Jul 8, 2020, 9:07 PM IST

నారాయణ స్కూల్ విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నిజామాబాద్​లోని డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాయి. అనుమతి లేకుండా జిల్లా కేంద్రంలో స్థానిక సెయింట్ తెరెసా హై స్కూల్ నిర్వాహకులు నారాయణ స్కూల్​ పేరుతో అడ్మిషన్లు ప్రారంభించారని మండిపడ్డారు.

ఆన్​లైన్​ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ఇదంతా చూస్తూ కూడా విద్యాశాఖధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా దీనిపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:'హరితహారం భావితరాలకు బంగారు బాట అవుతుంది'

ABOUT THE AUTHOR

...view details