తెలంగాణ

telangana

ETV Bharat / state

కనీస వేతనం పెంచేలా జీవో ఇవ్వండి

కనీస వేతనాలు పెంచేలా గెజిట్​ జారీ చేయాలంటూ ఐఎఫ్​టీయూ నాయకులు కలెక్టరేట్​ ముందు ధర్నా నిర్వహించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతన సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు.

కనీస వేతనం పెంచేలా జీవో ఇవ్వండి

By

Published : Jun 10, 2019, 5:26 PM IST

నిజామాబాద్​ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు రోజువారి వేతనాలు పెంచేలా కలెక్టర్​ చర్యలు తీసుకోవాలని ఐఎఫ్​టీయూ నాయకులు కలెక్టరేట్​ ముందు ధర్నాచేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేలా జీవో జారీచేయాలని డిమాండ్​ చేశారు. తెలంగాణ యూనివర్శిటీలో బోధన, బోధనేతర సిబ్బంది సుమారు 250 మంది వరకు పనిచేస్తున్నారని, వారందరికి కనీస వేతనం పెంచాలని విజ్ఞప్తి చేశారు.

కనీస వేతనం పెంచేలా జీవో ఇవ్వండి

ABOUT THE AUTHOR

...view details