ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లాక్ డౌన్ కొనసాగుతోంది. నిత్యావసర సరకులు, కూరగాయల కోసం మధ్యాహ్నం ఒంటి గంట వరకే అనుమతి ఉంది. నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల నుంచి కొత్త కేసులు రాలేదు. రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణ, ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో చర్చించారు.
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఇందల్వాయి టోల్ ప్లాజాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా కట్టడి చర్యలను పరిశీలించారు. డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో ని కొనుగోలు కేంద్రాల్లో తీసుకుంటున్న జాగ్రత్తలు పరిశీలించారు.