తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ బట్టల షాపులో బొమ్మకి పీపీఈ కిట్​ వేశారు! - statue was dressed with ppe kit at nizamabad

సాధారణంగా షాపింగ్​ మాల్స్​లో బట్టల దుకాణాల ముందు ఉండే బొమ్మలకు అందమైన బట్టలు అలంకరించి కొనుగోలుదారులను ఆకర్షిస్తారు. ఇప్పుడు ఈ అందమైన బట్టల జాబితాలో ఆకర్షించే మరో వస్తువు వచ్చి చేరింది. ఆ వస్తువేంటి? అదెక్కడ అలంకరించారు?

ppe kit for statue in nizamabad shop
ఆ బట్టల షాపులో బొమ్మకి పీపీఈ కిట్​ వేశారు!

By

Published : Jul 21, 2020, 1:40 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ప్రజలంతా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కాలంలో వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు ఇలా చాలా మంది.. వైరస్​ బారిన పడకుండా తమను తాము కాపాడుకోవడానికి పీపీఈ కిట్​ను ధరిస్తున్నారు.

అయితే ఈ పీపీఈ కిట్లు కేవలం మెడికల్ దుకాణాల్లోనే లభించేవి. కానీ తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ బట్టల దుకాణం ముందున్న బొమ్మకు పీపీఈ కిట్​ను అలంకరించి విక్రయానికి పెట్టారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బట్టల కన్నా పీపీఈ కిట్లకే డిమాండ్ పెరుగుతున్నందున ఇలా పీపీఈ కిట్లను అమ్మకానికి పెట్టినట్లు యజమాని తెలిపారు.

ఇదీ చూడండి:కరోనా ఉద్ధృతికి బ్రెజిల్​లో 80 వేలు దాటిన మరణాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details