నిజామాబాద్‌లోని ఓ వ్యక్తి కరోనా లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరంతో నగరానికి చెందిన ఆసుపత్రిలోని కొవిడ్ కేంద్రానికి వెళ్లాడు. అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కరోనా అనుమానితులు అంటున్నారు. ఓ వైపు జిల్లా అధికారులు ఆసుపత్రిలో కరోనా పరీక్షల కోసం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు చెబుతుండగా.. ఇక్కడ మాత్రం సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
కరోనా పరీక్షల కోసం వచ్చిన వారి పట్ల సిబ్బంది నిర్వాకం
నిజామాబాద్ జిల్లాలో కరోనా రోజురోజుకు కల్లోలం సృష్టిస్తోంది. ఎవరికి వైరస్ ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొవిడ్ పరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి వచ్చిన వారిపట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కరోనా అనుమానితులు చెబుతున్నారు.
కరోనా పరీక్షల కోసం వచ్చిన వారి పట్ల సిబ్బంది నిర్వాకం
పరీక్షలు చేయమని అక్కడి వైద్యులు చెబుతుండగా ఆ దృశ్యాలను సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించి తమ గోడును వెల్లడించారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోతున్నారు.
ఇదీ చూడండి :ఉస్మానియాలోకి వర్షపు నీరు.. ఆందోళనలో రోగులు, వైద్యులు