శ్రీరాంసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద, వర్షాలతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. జలాశయంలోకి 86,463 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 863 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.
ఎస్సారెస్పీ జలాశయానికి కొనసాగుతున్న వరద
శ్రీరాంసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎడతెరిపి లేని వర్షాలు, ఎగువనుంచి వస్తున్న వరదతో తెలంగాణ వరప్రదాయని ఎస్సారెస్పీ నిండుకుండలా పొంగిపొర్లుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 86వేల 463 క్యూసెక్కుల నీరు చేరుతోంది.
ఎస్సారెస్పీ జలాశయానికి కొనసాగుతున్న వరద
ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా... ప్రస్తుతం 1,084.90 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 90.313 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 66.526 టీఎంసీలుగా ఉంది.
ఇదీ చూడండి:గోదావరి ఉప్పొంగింది... కృష్ణమ్మ ఉరకలెత్తింది