నిజామాబాద్ జిల్లా శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకి మళ్లీ వరద వచ్చి చేరుతోంది. జలాశయం ఎగువ ప్రాంతం బాబ్లీ ప్రాజెక్టు నుంచి 29,759 క్యూసెక్కుల వరద నీరు ఎస్సారెస్పీకి ప్రవహిస్తోంది. స్వల్ప వరద రావడంతో అధికారులు 8 గేట్ల ద్వారా 25,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
ఎస్సారెస్పీకి మళ్లీ వరద ప్రవాహం.. 8 గేట్లు ఎత్తివేత
శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకి మళ్లీ వరద ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం బాబ్లీ నుంచి వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు 8 గేట్లని ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎస్సారెస్పీకి మళ్లీ వరద ప్రవాహం.. 8 గేట్లు ఎత్తివేత
ఈ సీజన్లో 66 రోజుల పాటు నీటిని విడుదల చేసిన అధికారులు.. నాలుగు రోజుల క్రితం అన్ని గేట్లు మూసివేశారు. ప్రస్తుతం వరద తిరిగి ప్రారంభం కావడంతో మళ్లీ నీటిని విడుదల చేశారు.
ఇదీ చదవండి:జోరుగా ఇసుక దందా.. పట్టించుకునే నాథుడే లేడు!