నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జలాశయం 6 గేట్లు ఎత్తి 18,750 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. 5,500 క్యూసెక్కుల నీటిని కాకతీయ కాలువ ద్వారా వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 31,609 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటి విడుదల - నిజామాబాద్ జిల్లా వార్తలు
ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జలాశయం 6 గేట్లు ఎత్తి 18,750 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.

SRSP
ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు తరలొస్తున్నారు. వరద తగ్గితే గేట్లు మూసివేస్తామని అధికారులు చెప్పారు.