తెలంగాణ

telangana

ETV Bharat / state

SRSP Gates Closed in Nizamabad : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​ గేట్లు క్లోజ్​.. కేంద్ర, రాష్ట్ర బృందాల పరిశీలన - నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం

SRSP today Water level in Nizamabad : వరద ప్రభావం తగ్గినందున నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుత నీటిమట్టం 1089.6 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్ట్​ పటిష్టతను కేంద్ర, రాష్ట్ర బృందాలు తనిఖీలు నిర్వహించారు. దీనిపై నివేదిక ఏర్పాటు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వనున్నాయని అధికారులు తెలిపారు.

SRSP Gates Closed in Nizamabad
SRSP Gates Closed in Nizamabad

By

Published : Jul 29, 2023, 7:26 PM IST

Sriram Sagar Project Water Capacity in Nizamabad: నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను అధికారులు మూసివేశారు. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గిపోవడంతో ప్రాజెక్టు గేట్లలను దించారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి ఎస్కెప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 1089.6 అడుగులు ఉంది. ఈ ప్రాజెక్ట్​ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. 82 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 60,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని పేర్కొన్నారు.

Special Committee Visit SRSP in Nizamabad: శ్రీరాంసాగర్ ప్రాజెక్టును కేంద్ర సేఫ్టీ రివ్యూ ప్యానెల్, సేఫ్టీ ఆర్గనైజేషన్ బృందాలు పరిశీలించారు. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ రిటైర్డ్ హై అండ్ క్యాడ్ హైడ్రాలజిస్ట్ రామరాజు డ్యామ్, సేఫ్టీ ఎక్సపర్ట్ సత్యనారాయణలతో కూడిన బృందం డ్యామ్ భద్రతా, రక్షణ అంశాలపై తనిఖీలు నిర్వహించారు. డ్యామ్ గ్యాలరీ స్పిల్ వే గేట్లు, సరస్వతి కాలువ, వరద కాలువలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాజెక్ట్​ భద్రతా,రక్షణ అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

Water Levels in Telangana Projects : శ్రీరాంసాగర్​, కడెం ప్రాజెక్టులకు తగ్గిన వరద ప్రవాహం

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​, నిజాంసాగర్ ప్రాజెక్ట్​ వివరాలు :

క్రమ సంఖ్య ప్రాజెక్ట్​ పేరు

పూర్తి నీటి నిల్వ సామర్థ్యం

(టీఎంసీల్లో)

ప్రస్తుత సామర్థ్యం

(టీఎంసీల్లో)

పూర్తి నీటిమట్టం

(అడుగుల్లో)

ప్రస్తుత నీటిమట్టం

(అడుగుల్లో)

ప్రస్తుత నీటి ప్రవాహం

(క్యూసెక్కులో)

1 శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 90 82 1,091 1,089.6 8,000 2 నిజాంసాగర్ ప్రాజెక్టు 17.802 17.340 1,405 1404.68 10,000

Nizam Sagar Project Water Level Today: మరోవైపు కామారెడ్డి జిల్లానిజాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రవాహం తగ్గుతోంది. 10వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. రెండు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుతం 1404.68 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17.340 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్ట్​ను శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో కలిసి పరిశీలించారు. ఇన్ ఫ్లో, అవుట్​ ఫ్లో, ప్రాజెక్ట్​ పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీజన్ ప్రారంభంలోనే ప్రాజెక్టు నిండటంతో సంతోషం వ్యక్తం చేశారు. రెండు పంటలకు సాగు నీరు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details