నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తోన్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 35 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా సుమారు 1,077 అడుగుల వరకు వరద నీరు వచ్చి చేరింది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జలకళ.. పొలాలకు నీటి విడుదల - శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటోంది. నాలుగు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. లక్ష్మీ సరస్వతి కాలువ ద్వారా పొలాలకు నీరు విడుదల చేస్తున్నారు.
srsp flood flow
ప్రస్తుతం ప్రాజెక్టులో 43 టీఎంసీల నీరు నిల్వ ఉంది. లక్ష్మీ సరస్వతి కాలువ ద్వారా పొలాలకు నీరు విడుదల చేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.