నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1,46,8744 క్యూసెక్కులుండగా 36 గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం (1091 అడుగులు)కు ప్రస్తుతం 1090 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 90.31 టీఎంసీలు ఉంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరదపోటు.. 36 గేట్లు ఎత్తివేత - sriram sagar project in nizamabad district
నిజామాబాద్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 36 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కులకుపైగా నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 36 గేట్లు ఎత్తిన అధికారులు
కరోనా వైరసి వ్యాప్తి వల్ల ఎస్సారెస్పీ ప్రాజెక్టుపైకి పర్యటకులను అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకూడదని సూచిస్తున్నారు.
Last Updated : Sep 19, 2020, 11:44 AM IST