మహారాష్ట్ర నుంచి వచ్చి చేరుతున్న వరదతో ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి... 50,000 క్యుసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
జలకళను సంతరించుకున్న శ్రీరాం సాగర్ ప్రాజెక్టు.. - today flow in srsp news
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండని తలపిస్తోంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి 50,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
జలకళను సంతరించుకున్న శ్రీరాం సాగర్ ప్రాజెక్టు..
ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో, ఓట్ఫ్లో 74,894 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా... నీటి సామర్థ్యం కూడా అంతే ఉంది. ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో పర్యాటకులకు అనుమతి నిలిపివేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి:ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు