నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి జలకళను సంతరించుకుంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో... జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
శ్రీరాంసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద - మహారాష్ట్ర వరద వార్తలు
శ్రీరాంసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. మహారాష్ట్ర నుంచి ఎస్సారెస్పీకి భారీగా నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం చేరుకోవడంతో జలాశయం గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
శ్రీరాంసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద
ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుతం 1090.8 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు అధికారులు వరద కాలువ ద్వారా 17,000 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 6,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మిగిలిన వరదను ఆర్సీ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
Last Updated : Sep 14, 2020, 2:02 PM IST