శ్రీకాంతాచారి చేసిన త్యాగాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నడూ మరిచిపోరని జాతీయ బీసీ కమిషనర్ సభ్యులు బ్రహ్మ శ్రీ తల్లోజు ఆచారి అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎప్పుడూ సమసిపోతుందో ఆ రోజే అతని ఆత్మశాంతిస్తుందని పేర్కొన్నారు.
శ్రీకాంతాచారి విగ్రహం ఆవిష్కరణ - శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆవిష్కరించిన బ్రహ్మ శ్రీ తల్లోజు ఆచారి
ఎందరో అమరువీరుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని జాతీయ బీసీ కమిషనర్ సభ్యులు బ్రహ్మ శ్రీ తల్లోజు ఆచారి అన్నారు. నిజామాబాద్ నగరం హనుమాన్ జంక్షన్లో శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
![శ్రీకాంతాచారి విగ్రహం ఆవిష్కరణ srikantachari-statue-unveiled-in-nizamabad-town](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8356524-266-8356524-1596983535659.jpg)
శ్రీకాంతా చారి విగ్రహం ఆవిష్కరణ
నిజామాబాద్ నగరంలోని హనుమాన్ జంక్షన్లో ఆయన చేతుల మీదుగా శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమం దిశను శ్రీకాంతాచారి బలిదానం మార్చివేసింది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :మంజీర నీరే.. కానీ కాస్త నల్లగా, వాసన వస్తాయంతే!