Srijana Tech fest Held At Mahila Polytechnic College In Nizamabad :సమాజహితం కోరి మేటి ఆవిష్కరణలకు రూపమిచ్చారు ఈ భావి ఇంజనీర్లు. సాంకేతిక ప్రదర్శనలో పదుగురికి పనికొచ్చే నమూనాలతో ఆకట్టుకున్నారు. దివ్యాంగులు, సైనికులకు ఉపయోగపడే పరికరాలు తయారుచేసి తమదైన ప్రత్యేకత చాటుకుంటున్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభా పాటవాలు చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఈ విద్యార్థులు. నిజామాబాద్‌లోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో(Mahila Polytechnic College) జరిగిన సృజన టెక్‌ఫెస్ట్ విద్యార్థుల సృజనాత్మకతకు వేదికైంది. జిల్లాస్థాయిలో జరిగిన ఈ పోటీలో విద్యావేత్తలు సైతం ఔరా అనేలా సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించారు ఈ విద్యార్థులు. సరికొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. నైపుణ్యాలకు పదును పెట్టుకుని ఉజ్వలభవితకు బాటలు వేసుకుంటున్నారు.
"ఈ యుగంలో మొబైల్ ఎక్కువ ఉపయోగిస్తున్నాం కాబట్టి దానిని ఉపయోగించి ఒక ప్రాజెక్టును తయారు చేస్తే బావుంటుందనే ఆలోచనతో ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేశాం. దీనిని ఉపయోగించి దివ్యాంగులు, ఎవరైతే నడవలేని స్థితిలో ఉన్నారో వారు మొబైల్ ఉపయోగించి ఇంట్లో ఉన్న లైట్స్, ఫ్యాన్స్ ఆన్, ఆఫ్ చేయవచ్చు."-అంజలి, పాలిటెక్నిక్ విద్యార్థిని
180గ్రాముల డ్రోన్- జేబులో తీసుకెళ్లొచ్చట!- ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 25నిమిషాల పాటు గాల్లో చక్కర్లు
Srijana Tech fest Mobile Controlled Home Appliances : ఈ ప్రదర్శనలో అంజలి బృందం రూపొందించిన మొబైల్ కంట్రోల్డ్ హోం అప్లియెన్సెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వాటిలో ఒకటి. మొబైల్ ఫోన్‌తో ఉన్నచోటి నుంచే ఇంట్లోని వస్తువులను నియంత్రించేలా ఈ నమూనాను తయారు చేశారు. ఆలోచింపజేసిన ఈ ప్రాజెక్టు దివ్యాంగులకెలా మేలు చేస్తుందో వివరిస్తోంది అంజలి. సృజన టెక్‌ఫెస్ట్‌లో(Srijana Tech fest) దివ్యాంగులకే ఉపకరించే మరో నమూనా వాయిస్ కంట్రోల్డ్ వీల్ ఛైర్. ఎవరి సాయం లేకుండానే వాయిస్ కమాండ్ ద్వారా ఇది ఎలా పనిచేస్తుందో ఈ నమూనా ఆధారంగా నిజమైన ఆటోమేటిక్ వీల్ ఛైర్ ఎలా తయారు చేయవచ్చో విద్యార్థుల మాటల్లోనే
"ఈ ప్రస్తుత కాలంలో వీల్ ఛైర్ చాలా ఉన్నాయి. కానీ ఆటోమోటిక్గా పనిచేసేవి లేవు, కేవలం కమాండ్ ఇవ్వడం ద్వారా లెప్ట్ రైట్ తిరిగే వీల్ ఛైర్ నడిచే దానిని మేము కనుగొన్నాం. మెుబైల్ ఆప్లికేషన్ ద్వారా వీలుఉన్న చోటికి ముందుకు వెళ్లేలా తయారు చేశాం. పక్షపాతం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ఖర్చు రూ.3000-4000 అయ్యింది."-శృతిన్, పాలిటెక్నిక్ విద్యార్థి