తెలంగాణ

telangana

ETV Bharat / state

విందులో చిందేశారు... అంతలోనే అనంత లోకాలకు! - JANAKAMPET ACCIDENT IN NIZAMABAD DISTRICT

వారందరూ... బంధువులతో ఆనందంగా విందులో గడిపారు. భోజనానంతరం వచ్చిందారినే తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలోనే విగత జీవులయ్యారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలోని అబ్బయ్య దర్గా వద్ద ఈ దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది.

ఆటోను ఢీకొట్టిన కారు... ఐదుగురు మృతి

By

Published : Nov 18, 2019, 8:42 PM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం తానా కలన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఆటోను ఢీకొట్టిన ఘటనలో అయిదుగురు మరణించారు. మండలంలోని కుర్నపల్లి దర్గా వద్ద వేడుకల్లో పాల్గొని తిరుగు ప్రయాణమవగా మార్గమధ్యలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆటో జానకంపేట్ వైపు వెళ్తుండగా జానకంపేట్-నిజామాబాద్ నుంచి కుర్నపల్లి-బోధన్ వైపు అతివేగంగా దూసుకొచ్చిన కారు...ఆటోను ఢీకొట్టడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది.

మృతులంతా జానకంపేట్ వారే...

మృతులందరూ ఒకే గ్రామం జానకంపేట్​కు చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జక్కం గంగమ్మ , జక్కం బాలమని , కల్లెపురం సాయిలు , చిక్కేల సాయిలు , ఆటో డ్రైవర్ నయిమ్ మృతుల జాబితాలో ఉన్నారు. ఆటో డ్రైవర్ నయిమ్ చికిత్స పొందుతూ నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో మరణించాడు.

ఆటోను ఢీకొట్టిన కారు... ఐదుగురు మృతి

ఇవీ చూడండి : బాలుడిని కిడ్నాప్​ చేసిన బాలుడు... రూ.3 లక్షలు డిమాండ్

ABOUT THE AUTHOR

...view details