NIZAMABAD URBAN PARK STORYఉరుకులు పరుగుల జీవన ప్రయాణంలో ప్రజలు ప్రకృతి రమణీయతను అస్వాదించలేకపోతున్నారు. రణగొణ ధ్వనులు కాలుష్యపు వాతావరణంలో జీవిస్తూ ప్రశాంతమైన వాతావరణానికి దూరమవుతున్నారు. అయితే ఇటువంటి పరిస్థితులనుంచి ప్రజలకు కాస్త ఉపశమనం ఇవ్వడానికే నిజామాబాద్‌కు పది కిలోమీటర్ల దూరంలో గల మక్లూర్ మండలం చిన్నాపూర్ అటవీప్రాంతంలో 10 కోట్ల వ్యయంతో 450 ఎకరాల పరిధిలో అర్బన్ పార్కు ఏర్పాటు చేశారు.
ఇప్పటికే పనులు పూర్తి చేసుకున్న పార్కు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. పార్కులో తిరిగినప్పడు అటవీలో సంచరించే అనుభూతి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఎత్తైన ప్రదేశం నుంచి చుట్టుపక్కల ప్రకృతిని ఆస్వాదించేలా వాచ్ టవర్ ఏర్పాటు చేశారు. ఈ అటవీ ప్రాంతంలో రకరకాల జంతువులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. వాటికి ఇబ్బందులు కలగకుండా ప్రజలు సంచరించే విధంగా నిర్వాహకులు రూపకల్పణ చేశారు.