తెలంగాణ

telangana

ETV Bharat / state

వైకల్యమే సిగ్గుపడేలా.. తోటివారికి సమానంగా.. - నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బాడ్సి

వైకల్యమే సిగ్గుపడేలా తోటివారితో సమానంగా జీవిస్తున్నాడు పదిహేనేళ్ల షయాన్. ఐదేళ్ల వయసులో విద్యుదాఘాతంతో తన రెండు చేతులు కోల్పోయినా.. పట్టుదలతో అనుకున్నది సాధించవచ్చని నిరూపించాడు. చదువుల్లోనే కాక ఆటల్లో తోటి వారికి పోటీ ఇస్తున్న షయాన్​ గురించి ప్రత్యేక కథనం. ​

తోటివారికి సమానంగా..
వైకల్యమే సిగ్గుపడేలా..

By

Published : Dec 24, 2019, 11:26 AM IST


నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బాడ్సికి చెందిన యాస్మిన్, షర్ఫుద్దీన్ దంపతుల రెండో సంతానం షయాన్. ఐదేళ్ళ వయసులో విద్యుదాఘాతంతో రెండు చేతులు కోల్పోయాడు. అప్పటినుంచి ఇంటికే పరిమితమైన షయాన్​ అందరితో చదువుకోవాలని, ఆడుకోవాలని అనుకున్నాడు. తన తల్లి ప్రోత్సాహం, అతని పట్టుదలతో కాలితో వ్రాయడం సాధన చేశాడు.

చదువుతో పాటు ఆటల్లో చురుకు..

అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేరాడు. ప్రస్తుతం తోటి విద్యార్థులతో కలిసి చదువుకోవడంతో పాటు వాలీబాల్, షటిల్, క్యారమ్, క్రికెట్ తదితర ఆటలు ఆడుతున్నాడు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న షయాన్.. విద్యాశాఖ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు.షయాన్ చురుకైన విద్యార్థి అని, చదువుతోపాటు ఆటల్లో ముందు ఉంటాడని ఉపాధ్యాయులు చెబుతున్నారు. షయాన్​కు ఎవరైనా దాతలు సహకరించి కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

తోటివారికి సమానంగా..

ప్రమాదవశాత్తు చిన్నతనంలోనే చేతులు కోల్పోయిన షయాన్ బాధ పడకుండా తోటివారితో సమానంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. త్వరలో పదోతరగతి పరీక్షలు రాయబోతున్న షయాన్ జీవితంలో విజయ తీరాలను ముద్దాడాలని మనమూ కోరుకుందాం.

వైకల్యమే సిగ్గుపడేలా.. తోటివారికి సమానంగా..

ఇవీ చూడండి: 330 స్టాళ్లతో పుస్తకాల ప్రదర్శన

ABOUT THE AUTHOR

...view details